సూర్యుడు తన తేజస్సును తిరిగి పొందిన క్షేత్రం ఇదే

తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన .. మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా 'కుంభకోణం' (తిరు కుడందై) కనిపిస్తుంది. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామివారికి 'శారంగపాణి పెరుమాళ్' .. అమ్మవారికి కోమలవల్లి తాయారు అని పేరు. స్వామివారి గర్భాలయం రథం ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ గర్భాలయానికి రెండు వైపుల మెట్లు వున్నాయి. ఉత్తర ద్వారానికి ఉత్తరాయణ వాకిలి అనీ .. దక్షిణ ద్వారానికి దక్షిణాయన వాకిలి అని పేరు. ఉత్తరాయణంలో ఉత్తరాయణ వాకిలిని తెరవడం విశేషం.
 
ఈ క్షేత్రానికి 'భాస్కర క్షేత్రం' అనే పేరు కూడా వుంది. పూర్వం 'సుదర్శన చక్రం'తో పోటీపడిన సూర్యుడు తన తేజస్సును కోల్పోతాడు. ఆ తరువాత ఈ ప్రదేశంలో స్వామివారి అనుగ్రహంతో తన తేజస్సును తిరిగి పొందినట్టుగా స్థలపురాణం చెబుతోంది. సూర్యభగవానుడి కోరికమేరకు స్వామి శారంగపాణిగా ఇక్కడ ఆవిర్భవించారని అంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించిన వారి పాపాలు పటాపంచలైపోయి, సకల శుభాలు కలుగుతాయనేది మహర్షుల మాట. 


More Bhakti News