పామరుడిని పండితుడిని చేసిన నరసింహస్వామి

భగవంతుడిపై ప్రహ్లాదుడికి గల నమ్మకాన్ని నిలబెట్టడానికి స్తంభం నుంచి అవతరించిన నరసింహస్వామి, హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఆ తరువాత స్వామి తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలాంటి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా 'అగిరిపల్లి' కనిపిస్తుంది. కృష్ణా జిల్లా నూజివీడుకి సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఈ క్షేత్రం మహిమాన్వితమైనదంటూ ఒక కథ ప్రచారంలో వుంది.

పూర్వం శోభన్న అనే ఒక అమాయకుడికి స్వామి దర్శనమిచ్చి ఆయన నాలుకపై బీజాక్షరాలు రాశాడట. దాంతో శోభన్న మహా పండితుడై స్వామివారిపై 'శతకాలు' రాశాడని కథనం. ఈ కారణంగానే ఈ శతకాలు .. శోభనాచల శతకాలుగా ప్రసిద్ధి చెందాయి. స్వామివారు కొలువైన ఈ పర్వతం కూడా 'శోభనాచలం' పేరుతో పిలవబడుతోంది. ఇదే పర్వతంపై శివాలయం కూడా ఉండటం మరో విశేషం. శివకేశవ క్షేత్రంగా వెలుగొందుతోన్న ఈ క్షేత్రం దర్శన మాత్రం చేతనే ధన్యులను చేస్తుందనీ, ఆపదలు .. అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.      


More Bhakti News