రావణుడికి వశిష్ఠ మహర్షి శాపం
సీతాదేవిని అపహరించిన రావణుడు .. శ్రీరాముడికి ఆగ్రహాన్ని కలిగిస్తాడు. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని ఎందరు చెప్పినా పెడచెవిన పెడతాడు. చివరికి శ్రీరాముడి చేతిలోనే ప్రాణాలను కోల్పోతాడు. రావణుడు యుద్ధభూమిలో నేలకొరగడానికి ఎంతోమంది తపః సంపన్నుల శాపాలు కారణమవుతాయి. అలా బ్రహ్మదేవుడు .. బృహస్పతి .. దత్తాత్రేయుడు .. నంది .. నారద మహర్షితో పాటు వశిష్ఠ మహర్షి శాపం కూడా రావణుడి మరణానికి కారణమవుతుంది.
తనకి వేదాలను బోధించమని ఒకసారి వశిష్ఠ మహర్షిని రావణుడు కోరతాడు. అందుకు వశిష్ఠుడు నిరాకరిస్తాడు. దాంతో ఆగ్రహించిన రావణుడు .. వశిష్ఠుడిని చెరసాలలో బంధిస్తాడు. అలా బంధించబడిన వశిష్ఠుడిని ఒక సూర్యవంశపు రాజు చెరసాల నుంచి విడిపిస్తాడు. 'రావణుడి మరణం సూర్యవంశపు రాజు చేతిలో వుంటుంది' అని ఆ సమయంలో వశిష్ఠుడు శపిస్తాడు. ఫలితంగా సూర్యవంశానికి చెందిన శ్రీరాముడి చేతిలోనే రావణుడు సంహరించబడతాడు.