సప్తమాతృకలు .. వాహనాలు

ప్రాచీన ఆలయాలను దర్శించినప్పుడు వరుసగా 7 గురు దేవతా మూర్తుల శిలా రూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకే వేదికపై గానీ .. గోడపై శిలా చిత్రాలుగా గాని 7 గురు దేవతా మూర్తుల రూపాలు పద్మాసనంతో దర్శనమిస్తుంటాయి. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఈ అమ్మవార్లనే 'సప్త మాతృకలు' అంటారు. 'బ్రహ్మణి' .. 'మహేశ్వరి' .. 'కౌమారి' .. ' వైష్ణవి' .. 'వారాహి'.. 'ఇంద్రాణి' .. 'చాముండి' అనేవి ఈ శక్తి స్వరూపాలకి గల పేర్లు.

అంధకాసురుడి సంహారంలో పరమశివుడికి 'సప్తమాతృకలు' సహకరించారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మాది దేవతల శక్తులన్నీ కలిసి .. ఏడు శక్తిస్వరూపాలుగా ఏర్పడ్డాయి. ఆ శక్తిస్వరూపాలే .. సప్తమాతృకలు. బ్రహ్మణి వాహనంగా 'హంస' .. మహేశ్వరి వాహనంగా 'వృషభం' .. కౌమారి వాహనంగా 'నెమలి' .. వైష్ణవి వాహనంగా 'గరుడ పక్షి' .. వారాహి వాహనంగా 'మహిషం' .. ఇంద్రాణి వాహనంగా 'ఏనుగు' .. చాముండి వాహనంగా 'శవం' కనిపిస్తాయి.      


More Bhakti News