రాహు - కేతు దోషాలను తొలగించే సుబ్రహ్మణ్యుడు
రాహు - కేతు దోషం ఆయా జాతకులను అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది. అందువలన రాహు - కేతు దోషం నుంచి విముక్తులు కావడానికి ఎవరికి వారు ప్రయత్నిస్తుంటారు. కుమారస్వామి .. సుబ్రహ్మణ్యస్వామిగా పిలవబడుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు .. నాగులకు అధిపతి. అందువలన ఆయనకి పూజాభిషేకాలు జరపడం వలన నాగులు శాంతిస్తాయి. ఫలితంగా రాహు - కేతు దోష నివారణ జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
సుబ్రహ్మణ్యస్వామికి 'మంగళవారం' అభిషేకం చేయడం వలన ఈ దోషం తొలగిపోతుంది. ఇక ఈ దోషంతో బాధపడుతున్నవారు, దుర్గాదేవిని .. గణపతిని పూజించడం వలన కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. రాహువుకు అమ్మవారు అధిదేవత .. అలాగే కేతువు అధిష్ఠాన దైవం గణపతి. అందువలన రాహు - కేతు దోషంతో నానా ఇబ్బందులు పడుతున్నవారు దుర్గాదేవి - గణపతులను పూజించినట్టయితే, ఆ దోషం తొలగిపోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.