అపమృత్యు దోషాలు తొలగించే నరసింహస్వామి
తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కోసం .. భక్తుడికి భగవంతుడిపై గల పూర్తి విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం నరసింహస్వామి ఆవిర్భవించాడు. ఆ తరువాత శాంతించిన నరసింహస్వామి, అనేక పుణ్య ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలా నరసింహస్వామి వెలసిన క్షేత్రాలు అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా .. మహిమాన్వితమైన క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. నరసింహస్వామి నామస్మరణ అనేక ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది. ఇక నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం వలన, అపమృత్యు దోషాలు తొలగిపోతాయనేది మహర్షుల మాట.
"ఉగ్రం వీరం మహావిష్ణుం .. జ్వలంతం సర్వతోముఖం .. నృసింహం భీషణం భద్రం .. మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహం" అనేది శ్రీనరసింహ మహా మృత్యుంజయ మంత్రం. ఈ మంత్రాన్ని అనునిత్యం పఠించేవారిని నరసింహస్వామి ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటాడు. ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వలన, అపమృత్యు దోషాలు తొలగిపోయి .. దీర్గాయువు కలుగుతుంది.