వైశాఖ మాసంలో శివకేశవుల ఆరాధన
తెలుగు మాసాల్లో చైత్ర మాసాన్ని 'మధుమాసం' అనీ .. వైశాఖ మాసాన్ని 'మాధవమాసం' అని పిలుస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణులను పూజించడం .. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిదనేది మహర్షుల మాట. ఈ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి గనుక, గొడుగు .. పాదరక్షలు .. నీటి పాత్రను దానం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో పరమశివుడికి అభిషేకం చేయడం వలన కూడా అనేక పుణ్యఫలాలు కలుగుతాయనేది శాస్త్రవచనం. వైశాఖ మాసంలో శివుడికి అభిషేకం చేయడం వలన సమస్త పాపాలు .. దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. అనారోగ్యాలు .. ఆపదలు .. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ మాసంలో శివకేశవ భేదం లేకుండగా అంకితభావంతో ఆరాధించడం వలన, ఉత్తమ జన్మలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.