పాపాలను హరించే తుంబుర తీర్థం

తిరుమల క్షేత్రంలో ఎన్నో పుణ్య తీర్థాలు వున్నాయి. ఈ పుణ్య తీర్థాలలో ఎంతోమంది మహర్షులు స్నానమాచరించి, వాటి విశిష్ఠతను లోకానికి చాటి చెప్పారు. తిరుమల క్షేత్రంలోని పుణ్య తీర్థాలలో 'తుంబుర తీర్థం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది.

పూర్వం 'తుంబురుడు' అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్ధించాడట. తిరుమలలోని ఈ తీర్థంలో స్నానమాచరించమని వాళ్లు సెలవివ్వడంతో, అలాగే చేసిన ఆ గంధర్వుడు మోక్షాన్ని పొందాడట. 'తుంబురుడు' మోక్షాన్ని పొందిన తీర్థం కనుక, ఈ తీర్థానికి 'తుంబుర తీర్థం' అనే పేరు వచ్చింది. ఈ కారణంగానే తిరుమల వెళ్లిన భక్తులలో కొందరు, ఈ తీర్థానికి చేరుకుని అందులో స్నానమాచరిస్తుంటారు.     


More Bhakti News