శివుడికి బిల్వదళ సమర్పణ ఫలితం
మహా శివరాత్రి రోజున ఉపవాసం .. జాగరణ .. శివపూజ ప్రధానంగా చెప్పబడ్డాయి. శివరాత్రి రోజున ఆవు పంచితం .. ఆవు పాలు .. ఆవు పెరుగు .. ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకించాలి. ' ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ స్వామిని అభిషేకించాలి. ఆ తరువాత ఉపవాస దీక్షతో శివ నామాన్ని స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున జాగరణకి ఎంతో ప్రాధాన్యత వుంది. అందువలన జాగరణ చేయాలి.
మహా శివరాత్రి రోజున 14 లోకాలలోని పుణ్య తీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతన్నాయి. అందువలన ఆ రోజున స్వామికి ఒక్క బిల్వ దళమైనా సమర్పించాలని శాస్త్రం చెబుతోంది. ఇక శివరాత్రి రోజున చేసే దానం కూడా అనేక రెట్ల పుణ్య ఫలితాలను ఇస్తుంది. అందువలన మహాశివరాత్రి రోజున క్షేత్ర దర్శనం చేయాలి. స్నానం .. ఉపవాసం .. జాగరణ .. దానం చేయడం మరిచిపోకూడదు. తనువును .. మనసును శివార్పితం చేస్తూ చేసే ఆరాధన వలన, ఆది దేవుడి అనుగ్రహం కలుగుతుంది.