మహా శివరాత్రి నాలుగు జాముల్లో నైవేద్యాలు

పరమశివుడు మంగళ స్వరూపుడు .. సకల శుభాలకి కారణభూతుడైన లోక శుభంకరుడు. అలాంటి ఆదిదేవుడిని అఠ్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పర్వదినమే మహాశివరాత్రి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ రోజున నాలుగు జాముల్లోను సదాశివుడిని అర్చించి, ఆ స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలని 'శివ పురాణం' చెబుతోంది.

మొదటి జాములో స్వామిని ఆవుపాలతో అభిషేకించి, పెసర పప్పుతో వండిన పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండో జామున పెరుగుతో అభిషేకించి, పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. మూడో జామున స్వామిని ఆవు నెయ్యితో అభిషేకించి, నువ్వుల పొడితో తయారు చేసిన తినుబండారాలను నైవేద్యంగా ఇవ్వాలి. నాలుగో జామున స్వామిని తేనెతో అభిషేకించి, అన్నం .. నేతి గారెలు .. భక్ష్యాలు నైవేద్యంగా సమర్పించాలి. మహా శివరాత్రి రోజున మహా శివుడిని ఈ విధంగా అభిషేకించి .. ఆరాధించడం వలన, ఆయన అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


More Bhakti News