శివరాత్రి నాలుగు జాముల్లో అర్చించే పుష్పాలు
మహాశివరాత్రి రోజున ఉపవాసం .. రాత్రి జాగారం .. శివపూజ ముఖ్యమైనవి. శివరాత్రి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి, స్నానాదికాలను పూర్తిచేసి శివాలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇంట్లో శివలింగం వున్నవారు భక్తిశ్రద్ధలతో నాలుగు జాముల్లోను శివుడిని అర్చించవలసి ఉంటుంది.
మొదటి జాములో స్వామివారిని గన్నేరు పూలతో పూజించవలసి ఉంటుంది. రెండవ జాములో తామరలతో అర్చించవలసి ఉంటుంది. మూడవ జాములో మారేడు దళాలతోను .. జిల్లేడు పూలతోను పూజించవలసి ఉంటుంది. నాల్గొవ జాములో కలువ పూలతో స్వామిని అర్చించవలసి ఉంటుంది. ఇలా శివరాత్రి రోజున ఆ సదా శివుడిని పూజించాలి. శివ గాథలతోను .. భజనలతోను జాగరణ చేయాలి. ఇలా శివరాత్రి రోజున స్వామిని ఆరాధించడం వలన సమస్త పాపాలు నశించి, అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.