ఇక్కడి నరసింహస్వామికి సర్పం ప్రదక్షిణలు చేస్తుందట

హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుడిని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు .. నరసింహస్వామిగా అవతరించాడు. ఆ తరువాత ప్రహ్లాదుడి కోరిక మేరకు ఆ స్వామి లక్ష్మీ సమేతుడై అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలా ఆ స్వామి వెలసిన ప్రాచీన క్షేత్రంగా 'చలిదోన' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా .. నాంపల్లి మండలం .. తుంగపాడు పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది.

కొండపై గల గుహలో ఏకశిలపై వెలసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహాలయం .. కోనేరు భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. ప్రతి రోజు సూర్యోదయానికి ముందు .. సూర్యాస్తమయం తరువాత ఒక 'సర్పం' స్వామివారికి ప్రదక్షిణలు చేసి వెళుతూ ఉంటుందని అర్చక స్వాములు చెబుతుంటారు. స్వామివారి అనుగ్రహం కారణంగా అనారోగ్యాలు దూరమవుతాయనీ .. ఆపదలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News