హంపిలో అడుగుపెడితే చాలు

'హంపి'లో రామాయణకాలం నాటి ఆనవాళ్లు కనిపిస్తాయి. కృష్ణదేవరాయల కాలం నాటి వైభవం కళ్ల ముందు కదలాడుతుంది. రామాయణ కాలంలో పంపానదిగా పిలవబడినదే ఇప్పుడు తుంగభద్రగా పిలవబడుతోందని చరిత్ర చెబుతోంది. రామాయణ కాలంలో సుగ్రీవుడి పాలనలో ఈ ప్రాంతం ఉండేదని చెబుతారు. అళియ రామారాయల మరణానంతరం తళ్లికోట యుద్ధం సమయంలోనే ఇక్కడి ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. శిధిలాలయాలే అయినప్పటికీ, ఆనాటి ఘన చరిత్రను అవి ఆవిష్కరిస్తూనే వున్నాయి.

అనేక ఆలయాల సమాహారంగా కనిపించే ఈ క్షేత్రంలో .. 'విరూపాక్ష స్వామి ఆలయం' .. కోదండ రామాలయం' .. 'కృష్ణాలయం' .. 'విఠలాలయం' .. 'రఘునాథ ఆలయం' .. 'రంగనాథ ఆలయం' .. 'అనంత శయన ఆలయం' .. 'అచ్యుతరాయ ఆలయం' .. 'అంతర్భూ ఆలయం' .. 'విష్ణుమూర్తి ఆలయం' .. 'ఆవగింజ గణపతి ఆలయం' .. 'శనగగింజ గణపతి ఆలయం' 'వరాహస్వామి ఆలయం' .. 'చంద్రశేఖర స్వామి ఆలయం' .. 'ఏకశిల రథం' .. 'దసరా దిబ్బ' .. 'సభా మంటపం' .. 'జల లింగం' .. అక్కడి శిల్పకళ ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. 'హంపి'లో అడుగుపెడితే చాలు, అడుగడుగునా అనేక విశేషాలు కనిపిస్తాయి .. మనసును అనుభూతుల మందిరం చేస్తాయి.


More Bhakti News