సమస్యలను తొలగించి సకల శుభాలనిచ్చే స్వస్తిక్ గుర్తు
జీవితం ఆనందంగా .. సాఫీగా సాగిపోవాలనే ఎవరైనా కోరుకుంటారు. జీవితంలో అసలైన ఆనందం విజయాన్ని సాధించినప్పుడు కలుగుతుంది .. అభివృద్ధిని సాధించినప్పుడు కలుగుతుంది. అయితే ఒక్కోసారి తలపెట్టిన కార్యాలు విఫలమవుతుంటాయి. అపజయాలు ఎదురవుతూ అసహనానికి గురిచేస్తుంటాయి. అసలు అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి ప్రయత్నమే చేయకుండా అనారోగ్యాలు చుట్టుముడుతూ ఉంటాయి. వ్యాధులు .. బాధలు సతమతం చేస్తూ నిస్సహాయుడిగా నిలబెడుతుంటాయి.
ఇలా ప్రతికూల పరిస్థితులు మానసికంగా .. శారీరకంగా కుంగదీస్తున్నప్పుడు ఇంటి గుమ్మానికి 'స్వస్తిక్' గుర్తు ఉంచాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంటి తలుపు దగ్గర స్వస్తిక్ గుర్తును ఉంచడం వలన, అన్ని రకాల విఘ్నాలు తొలగిపోయి విజయాలు చేకూరతాయి. కష్టాలు .. నష్టాలు .. బాధలు దూరమవుతాయి. అనారోగ్యాలు తొలగిపోయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. అందువలన ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర స్వస్తిక్ గుర్తును ఉంచడం మంచిదనేది పెద్దల మాట.