సూర్యుడు ఏ మాసంలో ఏ పేరుతో సంచరిస్తాడు
సూర్యోదయం వలన పాపాలు నశించి దుఃఖాలు దూరమవుతాయి. అలాంటి సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించడమనేది అనాది కాలం నుంచి వుంది. సూర్యభగవానుడిని పూజించే పాండవులు 'అక్షయ పాత్ర'ను పొందారు. సత్రాజిత్తు 'శ్యమంతకమణి'ని సాధించాడు. సూర్యుడి రథానికి ఒకే అశ్వం ఉంటుంది .. దానిపేరు 'సప్త'. ఒకే చక్రం ఉంటుంది .. అదే కాలచక్రం.
సూర్యభగవానుడు 12 మాసాలలో ఒక్కో మాసంలో ఒక్కో పేరుతో 12 రాశులలో సంచరిస్తూ ఉంటాడు. చైత్రంలో 'ధాత' .. వైశాఖంలో 'అర్యముడు' .. జ్యేష్టంలో 'మిత్రుడు' .. ఆషాఢంలో 'వరుణుడు' .. శ్రావణంలో 'ఇంద్రుడు' .. భాద్రపదంలో 'వివస్వంతుడు' .. ఆశ్వయుజంలో 'త్వష్టా' .. 'కార్తీకంలో 'విష్ణువు' .. మార్గశిరంలో 'అంశుమంతుడు' .. పుష్యంలో 'భగుడు' .. మాఘంలో 'పూషా' .. ఫాల్గుణంలో 'పర్జన్యుడు' పేరుతో సంచరిస్తుంటాడు.