ఐదు రూపాలలో గోచరించే భగవంతుడు
ఏదైనా కష్టం వచ్చినప్పుడు 'భగవంతుడిపై భారం వేశాము' అనే మాటను వింటూ ఉంటాము. అలాంటి భగవంతుడు అనేక రూపాలతో పిలవబడుతున్నాడు .. అనేక నామాలతో కొలవబడుతున్నాడు. అందరూ ప్రార్ధించే ఆ భగవంతుడు, ఐదు రూపాలలో గోచరిస్తుంటాడు. ఆ ఐదు రూపాలే పర .. వ్యూహ .. విభవ .. అంతర్యామి .. అర్చారూపం.
పోల్చి చెప్పేందుకు వీలుకాని రూపమే 'పరా' రూపం. పరమాత్మే పరా రూపంలో సాక్షాత్కరిస్తుంటాడు. 'వ్యూహ' రూపంలో పరమాత్ముడు వాసుదేవుడు. పురుష .. సత్య .. అచ్యుత .. అనిరుద్ధ అనే నాలుగు నామాలతో ఆయన ప్రసిద్ధి. పరమాత్మ అవతారాలన్నీ అనంతాలే. ఆయన అవతారాలన్నీ 'విభవ' రూపాలుగానే చెప్పబడుతున్నాయి. ప్రతి జీవిలో సూక్ష్మ రూపంలో వుండే స్వామి రూపమే 'అంతర్యామి'. స్వామి ఐదో రూపమే అర్చావతారం. ఈ అవతారంలో స్వామివారు సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాడు. భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తుంటాడు.