ఇక్కడి విజయలక్ష్మీ అమ్మవారి ప్రత్యేకత అదే
కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట సమీపంలో 'పంపా' సరోవరం కనిపిస్తుంది. ఈ సరోవరం గట్టుపై విజయలక్ష్మీదేవి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని విద్యారణ్యస్వామివారు నిర్మించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. విజయనగర సామ్రాజ్య స్థాపనకు ముందు విద్యారణ్యస్వామివారు ఇక్కడ 12 యేళ్ల పాటు తపస్సు చేశారట.
ఆయన నిరంతరం 'కనకధారా స్తవం' చేయడం వలన, అమ్మవారు అనుగ్రహించి కనక వర్షం కురిపించిందట. అందుకు గుర్తుగానే ఆయన అమ్మవారు ప్రత్యక్షమైన ఈ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించాడని అంటారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడం వలన, తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. విజయాలు చేకూరతాయని భావిస్తారు. పంపా సరోవరం .. విజయలక్ష్మి అమ్మవారి దర్శనం మనసుకు ఆహ్లాదాన్ని చేకూర్చుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.