రుక్మిణీదేవిచే పూజించబడిన మూలాంకురేశ్వరి

శ్రీకృష్ణుడు తనని ఎంతగానో ప్రేమించిన రుక్మిణీదేవిని అపహరించి, ఆమెను పెళ్లాడిన కథ ఎన్ని మార్లు విన్నప్పటికీ వినాలనిపిస్తూనే ఉంటుంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశంగా గుంటూరు జిల్లాలోని అమీన్ బాద్ చెప్పబడుతోంది. ఫిరంగిపురం మండలంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని ఆరాధిస్తుంది. అయితే ఆమె తండ్రి భీష్మకుడు ఆమెను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.

అందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతుండగా, అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడితో ఆమె శ్రీకృష్ణుడికి కబురు చేస్తుంది. తమ ఇలవేల్పు అయిన మూలాంకురేశ్వరి దర్శనం చేసుకుంటానని చెప్పి, పరిచారికలు వెంటరాగా ఆలయానికి వెళుతుంది. రథంపై అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడు ఆమెను తీసుకుని వెళ్లిపోతాడు. రుక్మిణి సోదరుడైన రుక్మి .. శ్రీకృష్ణుడిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకి శిరోముండనం చేసిన ప్రదేశమే 'డోకిపర్రు' అని స్థల పురాణం చెబుతోంది. ఇప్పటికీ ఇక్కడ మూలాకురేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చూడవచ్చు.  


More Bhakti News