అష్టావక్రుని ఆటపట్టించిన రావణుడు
రావణుడు మహాభక్తుడు అయినప్పటికీ, మహాబలశాలిననే అహంభావంతో ఆయన చేసిన పనులే ఆయన ప్రాణాల మీదకి తెచ్చాయి. ఎంతోమంది మహర్షులను .. సాధువులను హేళన చేయడం వలన ఆయన పొందిన శాపాలు, ఆయనను యుద్ధ రంగంలో కుప్పకూలేలా చేశాయి.
ఎనిమిది వంకరలతో జన్మించిన అష్టావక్రుడు, తపోబల సంపన్నుడవుతాడు. ఒకసారి ఆయన తన మానాన తాను వెళుతూ ఉండగా, వెనకగా రథంపై వస్తున్న రావణుడు అష్టావక్రుడి 'గూని'పై బలంగా కొడతాడు. అలా కొడుతూ .. 'వంకరలు సరి చేయమంటావా?' అంటూ హేళన చేస్తాడు. రావణుడి చేష్టలు అష్టావక్రుడిని ఎంతగానో బాధిస్తాయి. దాంతో త్వరలో జరగనున్న యుద్ధంలో రావణుడి శరీరం పడిపోతుందనీ, రూపం గుర్తుపట్టలేనంతగా ఆ శరీరం కోతులతో తొక్కబడుతుందని శపిస్తాడు. రావణుడు ఆ శాపాన్ని తేలికగానే తీసుకుంటాడు. కానీ అష్టావక్రుడు శపించినట్టుగానే యుద్ధంలో రాముడి చేతిలో మరణించిన రావణుడి శరీరం వానరాలతో తొక్కబడుతుంది.