అలాంటివారియందే లక్ష్మీదేవి అనుగ్రహం
జీవితం సంతోషంగా .. సాఫీగా సాగిపోవాలంటే సంపదకు లోటు లేకుండా ఉండాలి. అలా ధనానికి లోటు లేకుండా ఉండాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం .. తనకి ప్రీతికరంగా నడచుకున్నవారి పట్ల మాత్రమే ఉంటుంది. లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు ఉండాలంటే, ఆమె మనసుకు నచ్చినట్టుగా నడుచుకోవాలి.
ఎప్పడూ కూడా సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి. ఎంతటి కష్ట నష్టాలు ఎదురైనా, సత్య వ్రతాన్ని వీడకూడదు. ఇక నిస్వార్థంగా వ్యవహరించాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి .. గురువులను పూజించాలి .. పెద్దలను గౌరవించాలి. నిస్సహాయులైన వారికీ, సాదు జంతువులకు ఆహారాన్ని అందించాలి. దైవ కార్యాలు .. ధర్మ కార్యాలు చేస్తూ ఉండాలి. తాను నిమిత్తమాత్రుడననీ .. తనతో చేయించువాడు భగవంతుడనే స్పృహను కలిగి ఉండాలి. ధర్మంగా తాను సంపాదించిన మొత్తంలో కొంత దానం చేయడానికి ఉపయోగించాలి. ఇలా పవిత్రమైన జీవితాన్ని గడిపేవారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనేది మహర్షుల మాట.