అందుకే గోష్ఠిపురం క్షేత్రానికి ఆ పేరు

108 దివ్య తిరుపతులలో ఒకటిగా 'తిరుక్కోట్టియూర్' కనిపిస్తుంది. పూదత్తాళ్వార్ .. పెరియాళ్వార్ .. తిరుమంగై ఆళ్వార్ చే కీర్తించబడిన ఈ క్షేత్రాన్నే 'గోష్ఠిపురం' అని పిలుస్తారు. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం హిరణ్యకశిపుడు పెడుతున్న బాధలను తట్టుకోలేకపోయిన దేవతలు, కదంబ మహర్షిని ఆశ్రయించారు. హిరణ్యకశిపుడు రాలేని ప్రదేశం ఎక్కడ వుందో చెప్పమని దేవతలు కోరగా, ఆ మహర్షి దేవతలకి ఈ ప్రదేశాన్ని చూపించాడట. అప్పటి నుంచి దేవతలంతా అక్కడే గోష్ఠి చేసిన కారణంగా, ఈ క్షేత్రానికి  గోష్ఠిపురం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి స్వామివారు సౌమ్యనారాయణ మూర్తి పేరుతోను .. అమ్మవారు తిరుమామగళ్ పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటున్నారు. ఈ ఆలయ గోపురం పై నుంచే రామానుజులవారు అష్టాక్షరీ మంత్రాన్ని ప్రజలందరికీ వెదజల్లారని స్థల పురాణం చెబుతోంది.      


More Bhakti News