మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం

మార్కండేయుడు మహా శివభక్తుడు .. అనునిత్యం పరమశివుడిని పూజించేవాడు. ఆ స్వామి సేవలో .. ఆ స్వామి నామ స్మరణలో మునిగితేలేవాడు. అలాంటి మార్కండేయుడు అల్పాయుష్కుడుగా జన్మించాడు.  ఆయన ఆయుష్షు తీరగానే తీసుకువెళ్లడానికి యమధర్మరాజు రాగా, పరమ శివుడు ఆయనను ఎదిరించి మార్కండేయుడికి దీర్ఘాయువును ప్రసాదించాడు.

అలాంటి మార్కండేయుడు మృత్వువు నుంచి బయటపడటానికి ' మృత్యు వినాశిని' అనే తీర్థంలో స్నానమాచరించడం  కూడా ఒక కారణమని 'తిరుప్పేర్ నగర్' స్థలపురాణం చెబుతోంది.  108 దివ్య  తిరుపతులలో ఒకటైన ఈ క్షేత్రాన్ని 'బృహత్పురి' అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు  'అప్పకుడత్తాన్' పేరుతోను .. అమ్మవారు కమలవల్లీ  తాయారు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటున్నారు. స్వామివారికి 'అప్పాలు' అంటే చాలా ఇష్టమట .. అందువల్లనే ఆయనకి ఆ పేరు వచ్చిందని అంటారు. ఇక్కడి మృత్యు వినాశిని తీర్థంలోనే మార్కండేయుడు  స్నానమాచరించి దీర్ఘాయువును  పొందాడని చెబుతారు. ఇక్కడ స్వామివారు పరాశర మహర్షికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు.


More Bhakti News