మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్

 లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు అనేక ప్రదేశాలలో .. అనేక నామాలతో ఆవిర్భవించాడు. తన భక్తులను అనుగ్రహించడం కోసం ఎన్నో  క్షేత్రాలలో కొలువయ్యాడు. అలా ఆ స్వామి వెలసిన క్షేత్రాలు విష్ణు స్థానాలుగా .. దివ్య తిరుపతులుగా ప్రసిద్ధి చెందాయి. 12 మంది ఆళ్వారులలో ఎవరో ఒకరు ఆయా క్షేత్రాల్లోని స్వామివారిని కీర్తించినవారే. అలాంటి దివ్య తిరుపతులలో ఒకటిగా 'తిరుమోగూర్' కనిపిస్తుంది. మధుర స్టేషన్ కి సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది.

ఇక్కడి స్వామివారు కాలమేఘస్వామి పేరుతోను .. అమ్మవార్లు తిరుమోగూర్ వల్లి - మేఘవల్లి పేర్లతోను పూజాభిషేకాలు అందుకుంటున్నారు. దేవతల ప్రార్ధన మేరకు స్వామివారు మోహినీ రూపంలో ప్రత్యక్షం కావడం వలన, ఈ క్షేత్రాన్ని 'మోహనపురం' పేరుతోనూ పిలుస్తుంటారు. ఇక్కడి సుదర్శనుడి ఆలయం చూసితీరవలసిందే. 16 చేతులుకలిగిన సుదర్శనమూర్తిని దర్శించుకోవడం వలన సమస్త పాపాలు నశిస్తాయి. అలాగే దుష్ట గ్రహ పీడలు .. అనారోగ్యాలు .. ఆపదలు తొలగిపోతాయి. తిరుమంగై ఆళ్వార్ ఇక్కడి స్వామివారిని కీర్తించిన తీరు మనసును ఆధ్యాత్మిక తీరం వెంట పరుగులు తీయిస్తుంది.


More Bhakti News