అప్సరసలు .. పేర్లు
దేవలోక సౌందర్యంతో తాపసులను కూడా వెంటతిప్పుకున్న అప్సరసలను గురించిన కథలు ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తాయి. మహర్షులు తపస్సులను తలపెట్టడం .. ఆ తపస్సులను భగ్నం చేయడానికి దేవేంద్రుడు అప్సరసలను పంపించడం గురించిన కథలను విన్నాము. అలా మహర్షుల మనసులను మళ్లించడంలో కొంతమంది అప్సరసలు విజయాన్ని సాధిస్తే, మరికొంతమంది మహర్షుల ఆగ్రహావేశాలకి గురై శాపాలను భరించారు.
అలాంటి అప్సరసలలో రంభ .. ఊర్వశి .. మేనక .. తిలోత్తమ పేర్లు మాత్రమే చాలా మందికి తెలుసు. మిగతా అప్సరసలుగా ఘృతాచి .. సహజన్య .. నిమ్లోచ .. వామన .. మండోదరి .. సుభోగ .. విశ్వాచి .. విపులానన .. భద్రాంగి .. చిత్రసేన .. ప్రమోచన .. ప్రమ్లోద .. మనోహరి .. మనో మోహిని .. రామ .. చిత్రమధ్య .. శుభానన .. సుకేశి .. నీలకుంతల .. మన్మదోద్ధపిని .. అలంబుష .. మిశ్రకేశి .. పుంజికస్థల .. క్రతుస్థల .. వలాంగి .. పరావతి .. మహారూప .. శశిరేఖ పేర్లు కనిపిస్తాయి.