500: రద్దయిన రూ.500 నోట్లను ఎల్లుండి నుంచి మెడికల్ షాపులు, ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లోనూ స్వీకరించరు
పెద్దనోట్ల రద్దు ప్రకటన చేసిన అనంతరం పెట్రోల్ బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ సేవల కోసం రూ.1000, రూ.500 నోట్లతో చెల్లింపులు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు గానూ గడువు కూడా విధించింది. ఇప్పటికే గడువు ముగియడంతో రూ.1000 నోటును ఆ ప్రాంతాల్లోనూ స్వీకరించడం లేదు. ఇక రద్దయిన రూ.500 నోట్ల చెల్లుబాటు గడువు కూడా రేపు అర్ధరాత్రితో ముగియనుంది. ఎల్లుండి నుంచి పాత 500 రూపాయల నోటును కూడా ఆయా ప్రదేశాల్లోనూ స్వీకరించరు. వాటిని బ్యాంకుల్లో ఈ నెల 30వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.