sp tyagi: భారత మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగికి మ‌రో మూడు రోజుల సీబీఐ రిమాండ్


అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న భారత మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగిని ఇటీవ‌లే సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. పోలీసు కస్ట‌డీలో ఉన్న ఆయనను సీబీఐ అధికారులు ఈ రోజు మ‌రోసారి న్యాయ‌స్థానంలో ప్ర‌వేశ‌పెట్టారు. ఆయ‌న‌ను విచారించిన అంశాల‌పై కోర్టుకు తెలిపారు. సీబీఐ అధికారుల వాద‌న‌లు విన్న కోర్టు ఎస్పీ త్యాగికి మ‌రో మూడురోజుల సీబీఐ రిమాండు విధించింది. ఆయనతో పాటు నిందితులుగా ఉన్న మరో ఇద్దరికి కూడా కస్టడీని పొడిగించింది. వారిని విచారించిన అనంత‌రం మ‌ళ్లీ న్యాయస్థానంలో వివ‌రాలు తెలపాల‌ని సూచించింది.

  • Loading...

More Telugu News