IT officers faced shocking experience: ఐటీ దాడులకు వచ్చిన అధికారుల పైకి కుక్కలను వదిలిన కాపలాదారు


నల్లధనంపై సమాచారంతో ఐన్ కమ్ ట్యాక్స్ అధికారులు భారీ ఎత్తున దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు నల్లకుబేరుల బండారం బట్టబయలవుతోంది. ఈ క్రమంలో దాడులు చేస్తున్న ఐటీ అధికారులకు ఊహించని అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే... బెంగళూరులోని యశ్వంతపురలోని ఓ అపార్ట్ మెంట్ లో పెద్ద ఎత్తున నల్లధనం ఉందని ఐటీ వారికి సమాచారం అందింది. దీంతో ఆ అపార్ట్ మెంట్ పై దాడికి ఐటీ అధికారులు పోలీసులతో కలిసి వెళ్లారు. ఒక్కసారిగా లోపలికి వస్తున్న ఐటీ అధికారులను చూసిన  ఆ అపార్ట్ మెంట్ కాపలాదారు అయిన వృద్ధురాలు తన పెంపుడు కుక్కలను వారిమీదకి ఉసిగొల్పింది.

దీంతో అధికారులు వెనక్కి పరుగెత్తారు. ఇంతలో పోలీసులు తమ లాఠీలతో వాటిని అడ్డుకుని, తాము పోలీసులమని చెప్పడంతో కుక్కలను వెనక్కి పిలిచింది. దీంతో ఆ అపార్ట్ మెంట్ లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 2.2 కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు పట్టుబడ్డాయి. ఈ నోట్లు తనవి కాదని, దగ్గర్లో ఉన్న క్లబ్ కి సంబంధించినవని ఆ నోట్లతో పట్టుబడ్డ వ్యక్తి చెప్పడంతో, ఆ క్లబ్ పై ఐటీ అధికారులు దాడులు చేశారు. దీంతో పట్టుబడ్డ నగదు మొత్తం తనదేనని అతను అంగీకరించాడు. 

  • Loading...

More Telugu News