azad: దేశ చరిత్రలోనే ఇది మొదటి సారి.. అధికార పక్షమే అడ్డుకుంటోంది: గులాంనబీ ఆజాద్ ఆగ్రహం
రాజ్యసభలో ఈ రోజు కూడా సీన్ రిపీట్ అయింది. విపక్ష పార్టీల సభ్యులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఈ అంశంపై చర్చించాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్ష సభ్యులు ఆందోళన తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ అధికార పక్షమే సభను అడ్డుకుంటోందని, ఇలా జరగడం దేశ చరిత్రలోనే ఇది మొదటి సారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో విపక్ష సభ్యులందరూ గందరగోళం సృష్టించడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.