demonitisation: నోట్ల రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గిన వెనిజులా దేశ ప్రభుత్వం... వాయిదా వేస్తున్నట్లు ప్రకటన
తమదేశంలో 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు నాలుగు రోజుక్రితం వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మడురో సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నోట్ల స్థానంలో ఆ దేశ ప్రభుత్వం వాటి విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ నోట్లు అందుబాటులోకి తీసుకు రావాలని భావించింది. అయితే, పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నికోలస్ మడురో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రజల ఆందోళన కారణంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
పెద్దనోటు రద్దు నేపథ్యంలో వెనిజులా ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. కొత్త నోట్లు దొరక్క, పాత నోట్లు చెల్లక డెలివరీ ట్రక్కులను దోచుకుంటుంటూ పోలీసులతో గొడవలకు దిగారు. నగదు అందుకోకపోవడంతో ఎన్నో దోపిడీలకు పాల్పడ్డారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం తమ నిర్ణయంపై వెనక్కి తగ్గింది.