rashi kanna: జిమ్‌లో చాలా శ్రమించాను.. అందుకే సన్నగా అయిపోయాను: హీరోయిన్ రాశిఖన్నా
జిమ్‌లో తాను చాలా శ్రమించానని, అందుకే ఇప్పుడు మరింత సన్నగా అయిపోయానని హీరోయిన్ రాశిఖన్నా చెప్పింది. ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న రాశిఖన్నా తనకు సంబంధించిన పలు అంశాలపై చెబుతూ ఆరోగ్యంగా ఉండడానికి స్వీట్లు, ప్రైడ్ చేసిన ఆహారపదార్థాలను తాను తినబోనని పేర్కొంది. తాను డైటింగ్ కూడా చేయబోనని చెప్పింది. తాను ఢిల్లీలో పెరిగానని, అక్కడే చదువుకున్నానని, చదువులో ఎప్పుడూ టాపర్‌గా నిలిచే దానినని చెప్పింది.
తాను ఐఏఎస్ అవుదామనుకున్నానని, సింగర్‌ని కూడా కావాలని ఉండేదని పేర్కొంది. అయితే తాను అనుకోకుండా యాక్టింగ్‌లోకి వచ్చానని చెప్పంది. తాను ఖాళీ సమయాల్లో అధికంగా పుస్తకాలు చదువుతానని, ఇప్పుడు కూడా టైమ్ దొరికితే ముఖ్యంగా ఆధ్యాత్మిక పుస్తకాలు, ఫిలాసఫీ పుస్తకాలు చదువుతానని తెలిపింది. తాను ఒత్తిడి ఎదుర్కునే అంశంపై మాట్లాడుతూ.. టైమ్ మేనేజ్మెంట్పై కొద్దిగా ఒత్తిడి ఎందుర్కుంటానని చెప్పింది.