japan banks: ఆ ప్లాన్ గురించి చెబుతారా? లేదా..? బ్రిటన్ ప్రధాని థెరీసా మేను హెచ్చరిస్తున్న జపాన్ బ్యాంకులు
బ్రెగ్జిట్ ప్లాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తమకు తెలపాల్సిందేనంటూ జపాన్ బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి. తమ సంస్థల పాస్‌పోర్టు హక్కులను యూరోపియన్ యూనియన్ రద్దు చేస్తుందని భయపడుతున్న ఈ బ్యాంకులు.. బ్రెగ్జిట్ ప్లాన్ గురించి తమకు తెలపకపోతే మరో ఆరు నెలల్లోగా లండన్ నుంచి తమ కార్యకలాపాలను తరలించేస్తామని బ్రిటన్ ప్రధాన మంత్రి థెరీసాను హెచ్చరించాయి. ఇందుకు సంబంధించిన ఓ ప్రకటనను నోమురా, దైవా కేపిటల్ మార్కెట్స్ సహా కొన్ని బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌ల నుంచి బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఇటీవలే అందుకున్నారు. ఐరోపా ఖండంలో తమ సర్వీసులను అమ్ముకునేందుకు పాస్‌పోర్టు హక్కులను కలిగి ఉన్న సిటీ మినిస్టర్ సైమన్ కిర్బీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ మార్క్ గార్నియర్‌లతో ఈ అంశంపై చర్చలు కూడా జరిపారు.