kl rah: ప్చ్.. ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్సయిన రాహుల్!
చెన్నయ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరివన్డేలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. అయితే, 199 పరుగులు చేసిన రాహుల్ మరో ఒక్కపరుగు చేస్తే డబుల్ సెంచరీ అవుతుందనగా వికెట్ కోల్పోయాడు. రషీద్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నిన్న సాయంత్రం టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రాహుల్ ఈ రోజు సాయంత్రం వరకు క్రీజులో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఓపికను పరీక్షించాడు. రాహుల్ అవుటయ్యాక క్రీజులోకి విజయ్ వచ్చాడు. మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నాయర్ అర్ధసెంచరీ సాధించి ప్రస్తుతం 71 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.
టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో మరో ఓపెనర్ పార్థివ్ పటేల్ 71 పరుగులు చేయగా, ఛటేశ్వర పుజారా 16, కెప్టెన్ విరాట్ కోహ్లీ 15 పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 477 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా స్కోరు 383/4 (107 ఓవర్లకి) గా ఉంది.