epf: ఎవ్వరూ ఊహించని విధంగా ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గిస్తూ నిర్ణయం
ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సీబీటీ భేటీలో గత ఏడాది కంటే ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2016-17 సంవత్సరానికి ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును 8.65 శాతంగా నిర్ణయించింది. 2015-16 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీరేట్లను అంతకుముందు ఉన్న రేటు కన్నా తగ్గించాలని సీబీటీ భావించింది. అందులో భాగంగా 8.8శాతం నుంచి 8.7శాతానికి తగ్గించాలని అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అయితే, కార్మిక సంఘాల నుంచి పూర్తిగా వ్యతిరేకత రావడంతో ఎదురవడంతో 8.8శాతం వడ్డీనే అందజేసింది. అయితే ఈ సారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా 8.65 శాతంగా నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకుంది.