demonitisation: కట్టలు తెంచుకున్న ఆవేశం... రెండు బ్యాంకులలోని ఫర్నిచర్ ధ్వంసం, పలుచోట్ల రోడ్ల దిగ్బంధం
పెద్దనోట్లను రద్దు చేసి నలభై రోజులు దాటినప్పటికీ ప్రజలకు అవసరమైన డబ్బు అందుబాటులోకి రాకపోవడంతో దేశ వ్యాప్తంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడినా కొన్ని చోట్ల డబ్బులు దొరకకపోతుండడంతో వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్, షామ్లి జిల్లాల్లో పలు బ్యాంకులపై ప్రజలు రాళ్లదాడి చేశారు. బ్యాంకు సిబ్బందిని చితకబాదారు. అలహాబాద్ బ్యాంకు సిబ్బందితో ఖాతాదారులు ఘర్షణకు దిగి దాడి చేశారు. ఆయా ప్రాంతాల్లోని రెండు బ్యాంకులలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పలుచోట్ల ప్రజలు రోడ్ల దిగ్బంధం చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.