jayalalitha: జయలలిత ఆస్తులపై పిటిషన్‌ కొట్టివేత.. పిటిషనర్ కు చివాట్లు పెట్టి, రూ.లక్ష జరిమానా వేసిన హైకోర్టు!


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ ఫాంహౌస్‌, శ్రీనగర్‌ కాలనీలో ఓ భవనం ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆమె ఆ ఆస్తుల‌కు సంబంధించి వీలునామా రాయ‌లేద‌ని ఆ ఆస్తుల‌ను తెలంగాణ స‌ర్కారు స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వాలని గరీబ్‌గైడ్‌ సంస్థ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌ను ఈ రోజు విచారించిన హైకోర్టు స‌ద‌రు సంస్థ‌కు చివాట్లు పెట్టింది. ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని మండిప‌డింది. న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ జయలలిత వీలునామా రాయలేదని, ఆమెకు వారసులు లేరని మీరెలా ఊహిస్తార‌ని పిటిషనర్లను ప్రశ్నిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేశారు. అంతేకాదు, ఇటువంటి పిటిష‌న్‌ దాఖలు చేసిన గరీబ్‌గైడ్‌ సంస్థకు రూ.లక్ష జరిమానా విధిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News