demonitisation rides: తమిళనాడు సీఎస్‌పై ఐటీ కొరడా: చిత్తూరు, బెంగళూరులోనూ సోదాలు!
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్శదర్శి రామ్మోహన్‌రావు ఇంట్లో ఈ రోజు తెల్లవారు జాము నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన వద్ద ఎంత సొమ్ము దొరుకుతుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. చెన్నయ్‌లోని అన్నానగర్‌లోని రామ్మోహన్‌రావు కుమారుడి ఇంట్లోను, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 13 చోట్ల ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో హైదరాబాద్, చెన్నయ్ ఐటీ శాఖ అధికారులు పాల్గొంటున్నారు. తమిళనాడుతో పాటు కర్టాటక, ఆంధ్రప్రదేశ్‌లోని రామ్మోహన్‌రావు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి చెన్నయ్, బెంగళూరు, చిత్తూరుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.