case for dogs: శునకాల కోసం కోర్టును ఆశ్రయించిన జంట .. ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తులు!
తాము అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ శునకం కోసం కెనడాకి చెందిన ఓ జంట తాజాగా కోర్టును ఆశ్రయించింది. సంతానం లేని ఆ జంట ఎంతో కాలంగా మూడు శునకాల్ని పెంచుకుంటోంది. అయితే, 16 ఏళ్లు కలిసి ఉన్న ఆ దంపతులు కొన్ని రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. సాధారణంగా తల్లిదండ్రులు విడిపోయినప్పుడు చిన్నారులు ఎవరి సంరక్షణలో పెరగాలో తెలుపుతూ కోర్టు సమస్యను పరిష్కరిస్తుండడం చూస్తూనే ఉంటాం. మరి ఈ జంటకు పిల్లలు లేరు... కానీ, శునకాలనే వీరు పిల్లలుగా పెంచుకున్నారు కదా... ఇప్పుడు ఆ శునకాల కోసమే కోర్టును ఆశ్రయించారు.
వీరి కేసు పట్ల మొదట ఆశ్చర్యం వ్యక్తం చేసిన కెనడా న్యాయస్థానం, ఆ తరువాత ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు కోర్టు న్యాయాధికారులు ఈ అంశంపై స్పందించి కుక్కలు పిల్లలతో సమానం కాదని అన్నారు. ఆ శునకాలు అవి ఎవరి దగ్గరకి వెళ్తే వారి దగ్గర వాటిని ఉంచుకోవచ్చని, లేదంటే వాటిని అమ్మేసుకోమని వారికి సలహా ఇచ్చారు. కుక్కల కోసం కోర్టును ఆశ్రయించి తమ విలువైన సమయాన్ని వృథా చేసినందుకు ఆ జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు.