demonitisation: జోరుగా సాగుతున్న నోట్ల ముద్రణ.. ఇక‌ కొత్త రూ.500 నోట్లు విరివిగా చలామణిలోకి!


దేశవ్యాప్తంగా నాలుగు ముద్రణాలయాలు ఉన్నాయన్న విష‌యం తెలిసిందే. అందులో రెండు మైసూరులో ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఉంటే, బెంగాల్‌లోని సల్బోని ఒకటి, నాసిక్‌లో మ‌రొక ముద్ర‌ణాల‌యం ఉంది. వాటిలోని నాసిక్‌లో పెద్ద మొత్తంలో రూ.500 నోట్లను ముద్రిస్తున్నారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత రూ.500 కొత్త నోట్లను ఇప్పటి వరకు ఎంతో మంది ప్ర‌జ‌లు అందుకోలేక‌పోయారు. బ్యాంకులు, ఏటీఎంలలో రూ.2వేల నోట్ల‌నే అధికంగా ఇస్తుండ‌డంతో దేశ వ్యాప్తంగా చిల్ల‌ర దొర‌క్క ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే, మ‌రికొన్ని రోజుల్లో ఆ ఇబ్బందుల‌న్నీ తొల‌గిపోబోతున్నాయి. ఎందుకంటే నాసిక్‌లోని నోట్ల ముద్రణాలయంలో రూ.500నోట్ల ముద్రణను సుమారు మూడింత‌లు వేగవంతం చేసిన‌ట్లు ముద్ర‌ణాల‌య అధికారులు తెలిపారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు తరువాత‌ రోజుకు 35లక్షల నోట్లను మాత్రమే ముద్రిస్తూ వ‌స్తోన్న ముద్ర‌ణాల‌యంలో కొన్ని రోజులుగా వాటి సంఖ్యను ఏకంగా కోటికి పెంచినట్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ వర్గాలు మీడియాకు తెలిపాయి. నిన్న భారీ మొత్తంలో కొత్త‌ నోట్లను రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు తెలిపారు. ఆర్బీఐకి మొత్తం 4.3కోట్ల నోట్లను పంపించామని, అందులో 1.1కోట్ల రూ.500 నోట్లు కాగా 1.2కోట్ల రూ.వందనోట్లు ఉన్నాయ‌ని చెప్పారు. వాటితో పాటు కోటి వరకు రూ.50, రూ.20నోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. నాసిక్ ముద్ర‌ణాల‌యం నుంచి న‌వంబ‌రు 8 త‌రువాతి నుంచి 43రోజుల్లో 82.8కోట్ల నోట్లు దేశవ్యాప్తంగా ఉన్న ప‌లు రిజ‌ర్వు బ్యాంకు శాఖ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేశారు. వాటిల్లో 25కోట్ల కొత్త రూ.500 నోట్లు ఉన్నాయి.

మూడు రోజుల నుంచి మ‌రో 8.3కోట్ల నోట్లు అక్క‌డి నుంచి పంపించారు. ఇందులో అధిక‌మొత్తంలో 500 రూపాయ‌ల నోట్లే ఉన్నాయి. మొత్తం 3.75కోట్లు కొత్త రూ.500నోట్లను దేశ వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. వ‌చ్చే నెల  31 నాటికి అన్ని నోట్లను కలిపి మరో 80కోట్ల నోట్లను ముద్రించనున్నట్లు పేర్కొన్నారు. వాటిలో 50 శాతం నోట్లు రూ.500 నోట్లేన‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News