roja: ఉప్పులేటి కల్పనను 'నగదురహిత' లావాదేవీల ద్వారా టీడీపీలోకి చేర్చుకున్నారా?: ఎమ్మెల్యే రోజా ఎద్దేవా


కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన త‌మ పార్టీని వదిలి టీడీపీ తీర్థం పుచ్చుకున్న అంశంపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమ‌ర్శ‌లు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జరిపి కల్పనను టీడీపీలోకి చేర్చుకున్నారా?  లేక నేరుగా క్యాష్ ఇచ్చి చేర్చుకున్నారా? అని ఎద్దేవా చేశారు. మ‌రోవైపు చంద్రబాబు నాయుడు పెద్ద‌నోట్ల ర‌ద్దుపై రోజుకోమాట మాట్లాడుతున్నార‌ని ఆమె అన్నారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు అధిక‌మై పోయాయ‌ని, ఏపీని అరాచక ప్రదేశ్‌, అఘాయిత్యాల ప్రదేశ్‌గా మార్చేశార‌ని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ మహిళా మంత్రులు స్పందించ‌డం లేద‌ని,వారికి వడ్డాణాలు, దందాలపై ఉన్న శ్రద్ధ మహిళలపై లేదని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News