demonitisation: మరో షాక్ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం.. రద్దైన నోట్లు రూ.10,000 లకు పైగా ఉంటే ఇక నేరమే!


పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నల్లకుబేరులు అక్రమాలకు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా మరో సంచలన అత్య‌వ‌స‌ర ఆదేశాన్ని జారీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఈ  ఆర్డినెన్స్‌ ప్రకారం ర‌ద్ద‌యిన‌ రూ.500 , రూ.1000 రూపాయిల‌ నోట్లు ఎవ‌రివ‌ద్ద‌యినా రూ.10,000లకు  పైగా ఉంటే నేరంగా పరిగణించ‌నున్నారు. ర‌ద్ద‌యిన పెద్ద‌నోట్లు క‌లిగి ప‌ట్టుబ‌డిన వారికి రూ.50 వేల జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు అయిదు రెట్లు జరిమానా వేయ‌నున్నారు. అంతేగాక, ఈ నేరానికి పాల్పడితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురపాలక మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచార‌ణ జ‌రిపించి, జరిమానాను కూడా విధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది.

ఈ నెల 30 తరువాత రద్దయిన నోట్లను రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో జ‌మ చేసుకోవ‌చ్చు. ఇందుకు సంబంధించిన గ్రేస్ పీరియడ్ ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించనుంది. ఈ నెల 30లోపే ఈ ఉత్తర్వులను జారీ చేయాల‌ని కేంద్ర స‌ర్కారు భావిస్తోంది. న‌వంబ‌రు 8కి ముందు దేశంలో మొత్తం రూ. 15.44 లక్షల కోట్ల పెద్ద‌నోట్లు చలామ‌ణీలో ఉన్న విష‌యం తెలిసిందే. వాటిలో ఈ నెల‌ 13 వ‌ర‌కు 12.44 లక్షల కోట్లు జ‌మ‌ అయినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ నెల 30 గడువు లోపు బ్యాంకుల్లో రూ.13 ల‌క్ష‌ల నుంచి 13.5 లక్షల కోట్లు డిపాజిట్ అవుతుంద‌ని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News