jayalalitha: జయలలిత మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని ఎందుకు ఆదేశించకూడదు?: మద్రాసు హైకోర్టు
జయలలిత మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లు ఈ రోజు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. జయలలిత ఆరోగ్యంపై అంతగోప్యత పాటించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పిన ప్రభుత్వ తరఫు న్యాయవాది.. ఇందులో గోప్యత ఏమీ పాటించలేదని అన్నారు. అయితే, ఈ సమాధానంతో సంతృప్తి చెందని న్యాయమూర్తి జయలలిత మృతిపై మీడియా కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిందని అన్నారు. జయలలిత మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జయలలిత మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు.