smart tv: కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ లకే కాదు.. స్మార్ట్ టీవీలకూ వైరస్ సోకుతుందట!


ఇంటర్నెట్ అనుసంధానంతో టీవీలోనే అన్ని రకాల యాప్ లతో పాటు పలు సర్వీసులు వినియోగించే వీలుకలిగిన స్మార్ట్ టీవీల వినియోగదారులకు ఆందోళ‌న క‌లిగించే విష‌యం ఒక‌టి తెలుస్తోంది. ఇంత‌వ‌ర‌కు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు మాత్రమే వైరస్ సోకుతుండ‌డం చూశాం. ఇప్పుడు స్మార్ట్ టీవీలకు కూడా వైరస్ సోకుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. యూరప్ లోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం త‌మ ఇంట్లో ఉన్న ఎల్‌జీ స్మార్ట్ టీవీలో ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అనంత‌రం అత‌డి కుటుంబసభ్యులు ఆ టీవీలో మూవీ చూస్తుండగా మధ్యలో ఆగిపోయింది. అనంత‌రం స్క్రీన్ పై వైరస్ సోకినట్లు చూపుతున్న ఓ ఇమేజ్ వ‌చ్చింది.

దీంతో సదరు ఇంజనీరు ఆ టీవీని మ‌ళ్లీ సెట్ చేయడానికి ప్ర‌యత్నించాడు. అయినప్ప‌టికీ మ‌ళ్లీ టీవీ ఆన్ కాలేదు. దీంతో త‌మ ఇంటికి వ‌చ్చి టీవీని బాగుచేయాల్సిందిగా టెక్నీషియన్‌కు చెప్పాడు. దీంతో వారి ఇంటికి వ‌చ్చి టెక్నీషియ‌న్ ఆ టీవీని రీసెట్ చేయడానికి రూ.23,170 ఖర్చ‌వుతుంద‌ని చెప్పాడు. అంతేగాక‌, టీవీలో సోకిన వైరస్ ను తొలగించడానికి మ‌రో రూ.11 వేలు ఖర్చవుతుందని అన్నాడు. స‌దరు ఇంజ‌నీరు త‌మ ఇంట్లోని ఆ స్మార్ట్ టీవీలో యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్ నే ఉప‌యోగించాడా? లేదా వేరే సైట్లను ఉప‌యోగించాడా? అనే విష‌యం గురించి స‌మాచారం లేదు.

  • Loading...

More Telugu News