bus driver: డ్రైవింగ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆర్టీసీ డ్రైవర్.. అయినా ప్రయాణికులను కాపాడాడు!
బస్సు డ్రైవింగ్ చేస్తుండగా ఆ ఆర్టీసీ డ్రైవర్‌కి గుండెపోటు వచ్చింది. నొప్పితో తల్లడిల్లిపోతున్నాడు. అయినా, బస్సులో ఉన్న ప్రయాణికుల క్షేమం కోసమే ఆలోచించాడు. అంతటి నొప్పిలోనూ బస్సును నడిరోడ్డులో నిలపకుండా, అలాగే వదిలేయకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలనే అనుకున్నాడు. అందుకే బస్సును ముందుకు తీసుకెళ్లి రోడ్డుపక్కన ఆపాడు. అనంతరం స్టీరింగ్‌పైనే నొప్పితో పడిపోయాడు. ఈ ఘటన ఆత్మకూరు వద్ద ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలకు సమీపంలో నెల్లూరు–ముంబై రహదారిపై చోటుచేసుకుంది. స్టీరింగ్‌పై వాలిపోయిన డ్రైవర్ కె.మస్తాన్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన మస్తాన్‌ను అందరూ అభినందించారు.