income tax: పాత పన్ను వివాదాల పరిష్కార పథకం గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం


ఈ ఏడాది జూన్ 1న కేంద్ర స‌ర్కారు పాత పన్ను వివాదాల పరిష్కార పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ప్ర‌క‌టించిన ప్ర‌కారం ఈ ప‌థ‌కం గ‌డువు రేప‌టితో ముగుస్తుంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క కంపెనీ కూడా పన్ను వివాద లావాదేవీని పరిష్కరించుకోలేకపోవడంతో ఈ పథకం గడువును పెంచుతూ మరో అవకాశాన్ని కల్పించింది. ఈ గడువును జనవరి 31, 2017 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప‌థ‌కం ద్వారా పాత లావాదేవీలకు సంబంధించి, ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఈ ప‌థ‌కాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని కేంద్ర స‌ర్కారు తెలిపింది.

  • Loading...

More Telugu News