demonitisation: జ‌న్‌ధ‌న్ ఖాతాల నుంచి రెండు వారాల్లో పెద్ద మొత్తంలో నగదు విత్ డ్రా


కేంద్ర ప్రభుత్వం పేద‌ల కోసం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం భారీగా డ‌బ్బు వ‌చ్చిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇన్ని రోజులు డ‌బ్బు జ‌మ చేసుకునేందుకు ఉత్సాహం చూపిన ప్ర‌జ‌లు ఇప్పుడు త‌మ ఖాతాల్లోంచి డ‌బ్బును డ్రా చేసుకోవ‌డానికి ఉత్సాహం చూపుతున్నారు. నవంబర్‌ 9 నాటికి 25.5 కోట్ల జనధన్‌ ఖాతాల్లో రూ.45,636.61 కోట్లు ఉన్నాయి. గ‌త‌నెల‌ 7 నాటికి జనధన్‌ ఖాతాల్లో రూ.74,610 కోట్లు జమ అయ్యాయ‌ని, అనంత‌రం విత్ డ్రా చేసుకుంటున్న ఖాతాదారుల సంఖ్య‌ పెరుగుతూ వచ్చింద‌ని కేంద్ర‌ ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. గత రెండు వారాలుగా జనధన్‌ ఖాతాల నుంచి విత్ డ్రా అయిన మొత్తం డ‌బ్బు ఏకంగా రూ.3,285 కోట్లుగా ఉంది. జనధన్‌ ఖాతాల్లో రూ.50వేలకు మించి జ‌మ చేసుకోకూడ‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిబంధ‌న విధించిన విష‌యం తెలిసిందే.

దానితో పాటు నెలకు కేవలం రూ.10వేలు మాత్రమే నగదు విత్ డ్రా తీసుకోవాల‌ని నిబంధన విధించింది. అయితే, ఇంత భారీగా నగదు విత్‌డ్రా జరగ‌డంతో జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ దుర్వినియోగం జరిగినట్టు అధికారులు గుర్తించారు. పెద్ద నోట్లను ర‌ద్దు చేసిన నవంబర్‌ 9 నుంచి నెల‌రోజుల్లో జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో రూ.28,973 కోట్లు జమ అయ్యాయి.

  • Loading...

More Telugu News