attacks: ఆ దాడి మా పనే...!: నైట్ క్లబ్ కాల్పులపై ఇస్లామిక్ స్టేట్
న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి ఉన్న సమయంలో టర్కీ నైట్ క్లబ్‌లోకి శాంతాక్లజ్ వేషం వేసుకొని వచ్చిన ఉగ్రవాది కాల్పులతో మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు సహా 39 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. టర్కీకి వ్యతిరేకంగా తమ సైనికుడే ఈ దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. హాలిడేను ఉత్సాహంగా గడుపుతున్న క్రిస్టియన్లే లక్ష్యంగా తమ సైనికుడు దాడి జరిపాడని తెలిపింది.