facebook live: శిశువు పుట్టే క్షణాలను ఫేస్బుక్ లైవ్లో చూపించిన మహిళ!
ఓ మహిళ తాను పడుతున్న ప్రసవ వేదనను ఫేస్బుక్ లైవ్లో చూపించిన ఘటన లండన్లో చోటుచేసుకుంది. సారా జేన్ లుంగ్స్ట్రామ్ (35) అనే మహిళ సోఫాలో కూర్చుని పిజ్జా తింటూనే తనకు కలిగిన లేబర్ పెయిన్స్ను లైవ్ లో చూపించింది. మూడవ బిడ్డకు జన్మనిచ్చిన సారా జేన్ లుంగ్స్ట్రామ్ ఈ విధంగా ఫేస్బుక్ లైవ్ లో తన అనుభవాన్ని పంచుకుంది. ఆమెకు శిశువు పుట్టే క్షణాలను చూసిన ఫేస్బుక్ యూజర్లు ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ బిడ్డకు ఆమె ఎవలినా బ్లాసమ్ అని పేరు పెట్టింది. కాన్పు సమయంలో తన కడుపులో జరిగిన ప్రతి కదలికను వివరించి చెప్పింది. ఈ లైవ్ ను మొత్తం రెండు లక్షల మంది చూశారు.