sundar pichai: పెద్దనోట్ల రద్దును నేను తక్కువగా అంచనా వేయను: గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్


ప్ర‌ముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సంస్థ‌ సీఈవో సుందర్‌ పిచాయ్ ప్ర‌స్తుతం భార‌త్‌లో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఆయ‌న.. భార‌త్‌లో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణయంపై స్పందించారు. ఈ అంశంలో తాను నిపుణుడిని కాద‌ని, అయితే ఇది ఓ సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో గూగుల్‌ సంస్థ నుంచి ఏ సాయం కావాల‌న్నా తాము త‌మ సేవ‌ల‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు.
పెద్ద స్థాయిలో మార్పులు తీసుకొచ్చినప్పుడు ఎంతో ప్రభావం ఉంటుందని ఆయ‌న అన్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు ప్రజలకు ఫోన్లలో ఇంట‌ర్నెట్ ద్వారా వాటిలో లోకేషన్‌ గుర్తించే వీలుండటంతో పాటు రైడ్‌-షేరింగ్‌ (క్యాబ్‌) స‌ర్వీసులు అందుబాటులోకి వచ్చాయని చెప్పిన ఆయ‌న.. దీంతో రవాణా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పుడు పెద్దనోట్ల రద్దును కూడా తాను తక్కువగా అంచనా వేయబోన‌ని, ఎన్నో మార్పులు వ‌స్తాయ‌ని అన్నారు. దేశంలో వ‌చ్చిన ఈ పెద్ద మార్పు వ‌ల్ల  ఎన్నో ప్రభావాలు ఉంటాయని అన్నారు. ఇప్ప‌టికే ల్యాండ్‌ లైన్లకు బదులు ప్ర‌జ‌లంతా సెల్‌ఫోన్లు వాడుతున్నారని గుర్తు చేసిన సుంద‌ర్ పిచాయ్‌.. అదేవిధంగా డిజిటల్‌ చెల్లింపులు భార‌త్‌కు గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయని చెప్పారు. భార‌త్‌లో ప్రజలు అనుకుంటున్న దానికన్నా అధికంగా మౌలికవసతులు ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News