tirupati: భక్తులతో కిక్కిరిసిపోతున్న తిరుమల


తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో వైకుంఠం-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి కనిపిస్తున్నాయి. భక్తుల రద్దీపై తితిదే ఈవో సాంబశివరావు మాట్లాడుతూ.. ఏకాదశి దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చే యాత్రికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రముఖులకు పరిమిత సంఖ్యలోనే టికెట్లను ఇస్తున్నట్లు, ప్రస్తుతం నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కంపార్ట్‌మెంట్లలోని భక్తులను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు ఉదయం 4 గంటల నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, ద్వాదశి రోజు రాత్రి వరకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు.  

  • Loading...

More Telugu News