whatsapp: వాట్సప్‌లో మరో రెండు కొత్త ఫీచర్స్!


స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న వాట్స‌ప్‌లోకి మ‌రో రెండు కొత్త ఫీచ‌ర్లు వ‌చ్చాయి. డివైస్‌లో ఉన్న వీడియోలను జిప్ లుగా పంపుకునే స‌దుపాయం వాట్స‌ప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా వాట్స‌ప్‌లో తీసుకొచ్చిన ఫీచ‌ర్‌తో యాప్‌లోనే పలు జిప్ ‌లను సెర్చ్ చేసుకోవచ్చు. అంతేగాక వాట్స‌ప్‌లో తీసుకొచ్చిన మరో ఫీచర్ తో మీడియా ఫైల్స్ సెండింగ్ పరిమితి సైతం పెరిగింది. వాట్స‌ప్‌లో ఇప్పటి వరకు ఒకేసారి 10 మీడియా ఫైల్స్‌ను సెండ్ చేసే అవ‌కాశం ఉండేంది. ఇకపై యూజ‌ర్లు ఒకేసారి 30 మీడియా ఫైల్స్‌ను సెండ్ చేసుకునే విధంగా వాట్స‌ప్ రూపుదిద్దుకుంది.

వాట్స‌ప్ తీసుకొచ్చిన‌ ఈ ఫీచర్లు వాట్సప్ బీటా వెర్షన్ 2.17.6 లో అందుబాటులో ఉన్నాయి. ఏపీకే మిర్రర్ వంటి థర్డ్ పార్టీ సైట్ల ద్వారా యూజర్లు వాట్సప్ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఈ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. కొన్ని రోజుల్లోనే ఫుల్ వెర్షన్‌లో ఈ స‌దుపాయాల‌ను తీసుకురానున్న‌ట్లు వాట్స‌ప్ ప్ర‌తినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News